వైఎస్‌ జగన్‌తో విష్ణు భేటీ.. ఇడుపులపాయలో ఏకాంత చర్చలు

వైఎస్‌ జగన్‌తో విష్ణు భేటీ.. ఇడుపులపాయలో ఏకాంత చర్చలు

వైఎస్‌ జగన్‌తో విష్ణు భేటీ.. ఇడుపులపాయలో ఏకాంత చర్చలు

నెల్లూరు: కావలి రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఆదివారం జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి , వైసీపీ అధినేత జగన్‌తో ఇడుపుల పాయలో ఏకాంతంగా చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో తన టిక్కెట్టు విషయమై సంప్రదించారు. వారిద్దరి మధ్య అంతర్గతంగా జరిగిన చర్చల సారాంశం ఏమిటో స్పష్టంగా తెలియదు కాని, ఈ భేటీకి సంబంధించి కావలి నియోజక వర్గంలో రకరకలా ప్రచారాలు ఊపందుకున్నాయి.

మరోవైపు.. కావలి కేంద్రంగా ఆదివారం మధ్యాహ్నం మరో సంఘటన నియోజకవర్గంలో ప్రధాన చర్చగా మారింది. సీనియర్‌ తెలుగుదేశం నాయకుడు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి స్వయాన బావ అయిన రామకోటారెడ్డి ఇంటికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అనుచరగణంతో కలిసి వెళ్లి మాట్లాడారు. వారింట్లోనే కలిసి భోజనం చేశారు. ఓ ఇంటి విషయమై మొదలైన మనస్పర్థలు కోటారెడ్డి కుటుంబాన్ని వైసీపీ వైపుకు తీసుకెళ్లబోతున్నాయనే ఊహాగానాలు ఊపందుకుంది.

తదనంతర పరిణామం
జగన్‌, విష్ణుల మధ్య ఏకాంతంగా జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రాలేదు. అయితే ఈ విషయమై కావలి నియోజకవర్గంలో పెద్ద చర్చ జరిగింది. వీరిద్దరి అంతరంగిక సమావేశంలో చర్చకు వచ్చిన పలు విష యాలు ప్రచారంలోకి వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో కావలి వైసీపీ టిక్కెట్టు ఆశిస్తున్నట్లు, తనకే టిక్కెట్టు ఇస్తానని పార్టీ అధినేత జగన్‌ తనకు మాట ఇచ్చినట్లు విష్ణువర్థన్‌రెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఇదే విషయమై జగన్‌తో చర్చించినట్లు తెలిసింది. తనకు టిక్కెట్టు ఇవ్వా లని కోరినట్లు తెలిసింది. టిక్కెట్టు ఇవ్వలేనని, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్‌ అన్నట్లు సమాచారం. అయితే ఈ సమాధానంతో విష్ణువర్థన్‌రెడ్డి సంతృప్తి చెందలేదని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌ రాజకీయ నిర్ణయంపై అనుచరులతో మాట్లాడాలని విష్ణువర్థన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్‌తో జరిగిన ఏకాంత చర్చల సారాంశాన్ని అనుచరులకు వివరించి వారి అభీష్టం మేరకు భవిష్యత్‌ నిర్ణయాన్ని తీసుకోవాలని విష్ణువర్థన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాలను కూడా వెను వెంటనే నిర్వహించి తన రాజకీయ నిర్ణయాన్ని సమర్థించాలని, తనకు అండగా నిలవాలని కోరుతూ జనం మధ్యకు వెళ్లాలని విష్ణువర్థన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కీలకం కానున్న నిర్ణయం
విష్ణువర్థన్‌రెడ్డి తీసుకోబోయే నిర్ణయం కావలి నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. ఆయనది సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం. ప్రజాసేవలో ఆస్తులు ధారబోసుకున్నారు తప్ప సంపాదించుకుంది ఏమి లేదనే వాదన నియోజకవర్గంలో బలంగా ఉంది. ఇటీవల వైసీపీ చేసుకున్న సర్వేలో సైతం అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల్లో విష్ణుకు మంచి పట్టు ఉన్నట్లు రిపోర్టు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో ఆయనకు బలమైన పట్టుంది. దశాబ్దాలుగా నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ కుటుంబానికి ప్రస్తుత రాజకీయ వారసు డిగా ఉన్న విష్ణువర్థన్‌రెడ్డి తాజాగా తీసుకో బోయే రాజకీయ నిర్ణయం ఎలా ఉండబో తోంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుం ది అనే విషయమై నియోజకవర్గంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీలో కొనసాగితే ఎలా ఉంటుంది..? ఒకవేళ మరో నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండబోతుంది అనే విషయాలపై విశ్లేషణలు ఊపందుకోనున్నాయి. మొత్తం పై విష్ణు తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించడానికి ఇక ఎక్కువ రోజులు సమయం పట్టదని తెలుస్తోంది.

కొత్త అనుమానాలు
ఇటీవల ఒక ఇంటి విషయమై జరిగిన వివాదం… ఆ తరువాత కొద్ది రోజులకే వైసీపీ నేతలు రామకోటారెడ్డికి ఇంటికి వెళ్లడం కావలిలో కొత్త అనుమానాలకు తెరలేపింది. రూరల్‌ మండలం మద్దూరుపాడులో దారికి సంబంధించి ఒక ఇల్లు అడ్డుగా ఉందనే విషయమే కొద్ది రోజులు గొడవ నడిచింది. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షలు కూడా చేశారు.

ఈ విషయంలో బీద సోదరులు తమకు వ్యతిరేకంగా స్పందించారనే కారణంగా రామకోటారెడ్డి కుమారుడు శశిధర్‌ రెడ్డి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, వైసీపీ క్యాడర్‌ కలిసి వీరి ఇంటికి వెళ్లడం, అక్కడే భోజనం చేయడంతో రామకోటారెడ్డి కుటుంబం రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకోబో తోందా..!? అనే అనుమానాలు స్థానికుల్లో మొదలయ్యాయి. రామకోటారెడ్డి ఇంటికి వైసీపీ నాయకులే వెళ్లారా..!? లేక ఆ కుటుం బ సభ్యులు ఆహ్వానిస్తే వెళ్లారా..!? వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయా..? జరి గుంటే వాటి సారాంశమేమిటీ..!? అనే ప్రశ్న లు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత ఇంటికి వైసీపీ నాయకులు వెళ్లడాన్ని స్థానికులు రాజకీయ కోణంలోనే చూస్తుండటం గమనార్హం.
సీన్‌:1
కావలి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఇడుపులపాయలో కలిశారు. ఆ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణలు అక్కడే ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి, జగన్‌లో చాలా సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు.
సీన్‌:2
ఆదివారం మధ్యాహ్నం దాదాపు ఇదే సమయానికి కావలిలో మరో రాజకీయ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి స్వయాన బావ, సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకుడు రామకోటారెడ్డి నివాసానికి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు వెళ్లారు. వీరి వెంట సుమారు 30 మంది వైసీపీ ద్వితీయశ్రేణి నాయకులు కూడా వెళ్లారు. అందరూ కలిసి రామకోటారెడ్డి ఇంట్లోనే విందు ఆరగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Name *
Email *
Website