నెల్లూరు టీడీపీ క్లీన్ స్వీప్‌కు అడుగు దూరం..!

నెల్లూరు టీడీపీ క్లీన్ స్వీప్‌కు అడుగు దూరం..!

నెల్లూరు టీడీపీ క్లీన్ స్వీప్‌కు అడుగు దూరం..!

క్లీన్ స్వీప్ చేయాలి. నెల్లూరు జిల్లాపై టీడీపీ అధినేత చంద్ర బాబు ల‌క్ష్యం ఇదే! దీనికి సంబంధించి ఆయ‌న చాలా క్లియ‌ర్‌గానే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్తితిలోనూ జిల్లాలో క‌నీసం 9 స్థానాల్లో పాగా వేయాలి. మొత్తం 10 స్థానాల‌లోనూ గ‌ట్టిప్ర‌భావం చూపించాలి. ఇదీ చంద్ర‌బాబు పెట్టుకున్న ల‌క్ష్యం. దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాల‌నే విష‌యంపైనా ఆయ‌న‌కు స్ప‌ష్ట‌మైన విజ‌న్ ఉంది. ఈ క్ర‌మంలోనే జిల్లా నుంచి ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వ‌చ్చే వారికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న వెంట‌నే స్పందిస్తున్నారు. అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌ల‌కు రాత్రికి రాత్రే చెక్ పెడుతున్నారు. ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎవ‌రు ఏం కావాల‌న్నా చేస్తున్నారు. జిల్లా అవ‌స‌రాల కోసం ఎంత చేయాలో అంత‌కు మించి అన్న‌ట్టుగా సీఎం ముందుకు వెళ్తున్నారు.

గ‌డిచిన నాలుగేళ్ల స‌మ‌యం ఒక ఎత్త‌యితే.. న‌డుస్తున్న స‌మ‌యం మ‌రో ఎత్తుగా బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు ఎంపీ టికెట్‌ను ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి దాదాపు క‌న్ప‌ర్మ్ చేయ‌డం ద్వారా స‌ర్వేప‌ల్లిలో మంత్రి సోమిరెడ్డికి దారి క్లియ‌ర్ చేశారు. అలాగే ఆదాల ప‌రిస్థితి బ‌ట్టి నెల్లూరు రూర‌ల్‌లోనూ పోటీ చేయ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు నెల్లూరు న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గం కేటాయించారు. సిట్టింగులుగా ఉన్న ఉద‌య‌గిరి, వెంక‌ట‌గిరి స్థానాల‌ను తిరిగి వారికే అప్ప‌గిస్తామ‌ని చెప్పారు. కోవూరులోనూ తిరిగి పోలంరెడ్డే పోటీ చేయ‌వ‌చ్చు. అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించ‌క‌పోయినా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓ క్లారిటీతో అయితే బాబు ఉన్నారు. అయితే అభ్య‌ర్థుల పేర్ల‌ను ముందుగానే ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇదంతా వ్యూహాత్మ‌కంగా సాగుతున్న విష‌యం. అయితే, దీని వెనుక ఉన్న మ‌ర్మాన్ని గ్ర‌హించ‌డంలో నాయ‌కులు స‌క్సెస్ అయ్యారా? అనేది మాత్రం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. మంత్రులుగా ఉన్న ఇద్ద‌రూ కూడా జిల్లా మొత్తాన్ని ప‌రుగు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు తీసుకుని ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంది.

ముఖ్యంగా కార్య‌క‌ర్త‌ల‌ను బ‌లోపేతం చేసుకుని, పార్టీ స‌భ్య‌త్వ న‌మోదును పెంచాలని కూడా చంద్ర‌బాబు భావించారు. అదేవిధంగా సీనియ‌ర్ల‌కు కూడా మార్గం సుగ‌మం చేశారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో వారికి కూడా బాధ్య‌త‌లు క‌ల్పించారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు విజ‌న్‌కు అనుగుణంగా అడుగులు ఇప్పుడిప్పుడే మొద‌ల‌య్యాయి. కానీ, ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చాలా త‌క్కువ ఉండ‌డంతో అటు ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను, పార్టీ వ్యూహాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అదేస‌మ‌యంలో నేత‌ల మ‌ధ్య స‌మన్వ‌యం పెంచుకుని, కార్య‌క‌ర్త‌ల్లో అయోమ‌యాన్ని తొల‌గించాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంల్లోనూ పార్టీ వాస్త‌వ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని ముందుకు సాగితే.. ప‌టిష్ట వ్యూహాన్ని అమ‌లు చేయ‌గ‌లిగితే.. విజ‌యం టీడీపీ ప‌క్షానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Name *
Email *
Website