టీడీపీకి రాజీనామా.. తేల్చేసిన మంత్రి అఖిల‌ప్రియ‌..?

టీడీపీకి రాజీనామా.. తేల్చేసిన మంత్రి అఖిల‌ప్రియ‌..?

టీడీపీకి రాజీనామా.. తేల్చేసిన మంత్రి అఖిల‌ప్రియ‌..?

ఇప్పుడు ఏపీలో మంత్రి భూమా అఖిలప్రియ టిడిపిని వీడుతున్నారనే టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో మంత్రి భూమా అఖిలప్రియ జనసేన బాట పడతారేమో అన్న అనుమానాలు కలిగాయి. భూమా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి తో తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలివానైంది. వీరిద్దరికీ మధ్య సఖ్యత కుదర్చడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది.

ఆ తర్వాత జరిగిన పరిణామాలలో భాగంగా మంత్రి అఖిలప్రియ కు ముఖ్య అనుచరుడి ఇంటి పై పోలీసులు సోదాలు చేసి అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పోలీసుల తీరుపై అఖిల ప్రియ నిరసన వ్యక్తం చేస్తూ తన గన్మెన్లను వెనక్కి పంపిం చేశారు. ఆ తర్వాత ఇది భద్రతల పరిరక్షణలో భాగంగా నే తనిఖీలు చేశామని, ఇవి తమ విధి నిర్వహణలో భాగమని పోలీసులు చెప్పినప్పటికీ అఖిల ప్రియ తన పంధా మార్చుకోలేదు. ఇక చంద్రబాబు కర్నూలు పర్యటన చేసిన సమయంలో కూడా అఖిల ప్రియ కార్యక్రమాలకు దూరంగానే ఉంది. దీంతో అఖిలప్రియ పార్టీని మారుతున్నారు అన్న ప్రచారం ప్రారంభమైంది.

అఖిల ప్రియ వైసీపీలో చేరతారా? లేక జనసేనబాట పడతారా అంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇక దీనిపై అఖిలప్రియ క్లారిటీ ఇచ్ఛారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తేల్చి చెప్పారు.టిడిపిని వీడి జనసేనలో అఖిలప్రియ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో భూమా అఖిలప్రియ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.శుక్రవారం నాడు మంత్రి అఖిలప్రియ టీడీపీని వీడి జనసేనలో చేరుతారనే ప్రచారంపై స్పందిస్తూ జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గ నుండి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి అత్యధిక మెజారిటీతో గెలిచి తన విజయాన్ని చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తారని తెలిపారు. ఇక తనకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని, కేవలం ఆళ్లగడ్డలో తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నందునే గన్‌మెన్లను దూరంగా పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. ఇక తాను చేస్తున్న పోరాటం తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నందుకు పోలీసుల పైనే కానీ తనకు అవకాశం ఇచ్చిన టిడిపి పై కాదని అఖిల ప్రియ తేల్చిచెప్పారు. మంత్రి అఖిల పార్టీ మారుతున్నారని కర్నూలు జిల్లాలో రేగిన దుమారం అఖిల ప్రియ క్లారిటీతో సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Name *
Email *
Website