ఆ నిర్ణయంతో చంద్రబాబు, జగన్ లకు టాలీవుడ్ షాక్..?

ఆ నిర్ణయంతో చంద్రబాబు, జగన్ లకు టాలీవుడ్ షాక్..?

ఆ నిర్ణయంతో చంద్రబాబు, జగన్ లకు టాలీవుడ్ షాక్..?

ఒకప్పుడు ఎన్నికలంటే సినీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. కానీ ఇప్పుడు సినీ తారలే పార్టీలో చేరుతుంటే ప్రత్యేకించి ఎన్నికల ప్రచారానికి సినీ గ్లామర్ అవసరం లేదనిపిస్తుంది. అయినా సరే ఎన్నికల ప్రచారంలో సినిమా తారల సందడి చేస్తే ఆ కిక్కే వేరప్పా అనే టాక్ ఉంది. సినీ తారల ప్రచారం వల్ల మంచి మైలేజ్ వస్తుందన్న పేరుంది. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికలకు సమయం కనపడుతున్న తరుణమిది. లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీలో ప్రధాన పార్టీలకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. దానికి కారణం ఎన్నికల ప్రచారం పై స్టార్ క్యాంపెయినర్ లు ఆసక్తి పెంచకపోవటం.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలు గమనించినట్లయితే పెద్దగా స్టార్ లు క్యాంపెయిన్ చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టార్ లు అయితే మాకెందుకు ఈ తలనొప్పి అన్న ధోరణిలో వ్యవహరించారు. ఎవరికి వారికి పార్టీలపై అభిమానం ఉన్న ఆ పార్టీల కోసం ప్రచారం చేస్తే తమ సినిమాలకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఎన్టీఆర్ వంటి స్టార్లు సైతం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక ఇదే పంధా ఏపీ లోనూ కొనసాగించ బోతున్నారు.ఇప్పటివరకు ఏపీలో జరిగిన ఎన్నికలలో ముఖ్యంగా టిడిపి తరఫున స్టార్లు ప్రచారం నిర్వహించారు. నందమూరి హీరోలు తమ గ్లామర్ టచ్ తో ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీలో ప్రచారానికి వారు దూరంగా ఉంటారు అన్నట్లుగా తెలుస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మెగా హీరోలు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నప్పటికీ పవన్ కూడా వారితో ప్రచారం నిర్వహిస్తారోలేదో అనేది ప్రశ్నార్ధకమే. బాబాయ్ పిలిస్తే తప్పక ప్రచారం చేస్తామని మెగా హీరోలు చెబుతున్నప్పటికీ బాబాయ్ పిలుస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఇది నిన్నటి వరకు జగన్ కోసం నాగార్జున, మోహన్ బాబు వంటి హీరోలు ప్రచారం చేస్తారని భావించినా, పార్టీలో చేరుతారని వార్తలు వచ్చినా అవి ప్రచారాలు గానే మిగిలిపోయాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా సినిమా ఇండస్ట్రీ నుండి సెలబ్రిటీలు ఎవరు పాల్గొనకపోవడంతో ఏపీలో కూడా ఇదే తరహాలో ప్రవర్తిస్తారని సినీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం. ఒకవేళ స్టార్లు ప్రచారం చేయాలి అనుకున్నా ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కి మాత్రమే ఆ అవకాశముంది. మరి దానిని పవన్ వాడుకుంటాడో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Name *
Email *
Website