అవును.. మా నాన్నకు క్యాన్సర్ ఉంది!

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని హృతిక్ రోషనే వెల్లడించాడు. మంగళవారం నుంచే అతనికి సర్జరీలు జరగనున్నట్లు హృతిక్ చెప్పాడు. సోషల్ మీడియాలో తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ చేదు వాస్తవాన్ని అతను తెలిపాడు. రాకేష్ రోషన్ మొదటి దశలో ఉన్న గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, మంగళవారం నుంచే సర్జరీలు జరగనున్నట్లు హృతిక్ చెప్పాడు. క్యాన్సర్ అని తెలిసినా తన తండ్రి ఆత్మైస్థెర్యం ఏమాత్రం దెబ్బ తినలేదని, అలాంటి లీడర్ తమ కుటుంబంలో ఉన్నందుకు తాము అదృష్టవంతులమని అన్నాడు. గొంతు క్యాన్సర్లలో ఒకటైన స్కామస్ సెల్ కార్సినోమాతో రాకేష్ రోషన్ బాధపడుతున్నాడు. రాకేష్ రోషన్ 1970లో వచ్చిన ఘర్ ఘర్ కీ కహానీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టాడు. బునియాద్, కామ్‌చోర్, ఖూబ్‌సూరత్‌లాంటి సినిమాలతో ఫేమస్ అయ్యాడు. 1987లో ఖుద్‌గర్జ్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. షారుక్‌తో కలిసి కోయ్‌లా, కరణ్ అర్జున్‌లాంటి హిట్ మూవీస్ తీశాడు.

2000లో తన తనయుడు హృతిక్‌ను కహో నా ప్యార్ హై మూవీతో హీరోగా పరిచయం చేశాడు. కోయ్ మిల్ గయా, క్రిష్ సిరీస్‌లో ఈ తండ్రీ తనయులు కలిసి పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Name *
Email *
Website